ఆమె ఉన్మాద లైంగిక పిచ్చి అతడి ప్రాణం తీసింది. 30 ఏళ్ళ ప్రియుణ్ణి ఓ వివాహిత పోర్న్ ఫిలింలో మాదిరి సెక్స్ చేయబోయి అతడి చావుకు కారణమైంది. నాగపూర్ లోని కాపార్కేడా ఏరియాలోని ఒక లాడ్జీలో ఈ ఘోరం జరిగింది. పెళ్ళై, పిల్లలున్న ఆమె ప్రియుడితో ఐదేళ్లుగా అక్రమసంబందంలో ఉంది. అతడితో కలిసి లాడ్జీకి వచ్చింది. అతడిని నగ్నంగా చేసి, కాళ్ళు, చేతులు కుర్చీకి కట్టేసింది. మెడకూ ఒక తాడు వేసి, దాన్ని ఫ్యాన్ కు కట్టింది. ఆ తరువాత బాత్ రూమ్ కు వెళ్ళింది.

ఇంతలో కుర్చీ బ్యాలెన్స్ తప్పి కిందపడటంతో ప్రియుడి మెడకు తాడు బిగుసుకుని ఊపిరాడక అతడు చనిపోయాడు. తరువాత ఆ మహిళ, లాడ్జి సిబ్బందిని పిలిచి, తాడు తీయించింది. అప్పటికే అతడు చనిపోయాడు. హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోర్న్ వీడియోలలో చూసి అలా, సెక్స్ చేయాలనుకున్నామని, ఇలా అవుతుందని అనుకోలేదని ఆ మహిళ పోలీసులకు చెప్పింది..