కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలోని విద్యారణ్యపురిలో పేకాట శిబిరం పై దాడి చేసిన పోలీసులు ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడితో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రూ . 2 ,78 ,990 నగదు, ఏడు సెల్‌ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు . ఆదివారం విద్యారణ్యపురిలోని ఎమ్మెల్యే సోదరుడి గృహంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ , కేయూ పోలీసులు దాడులు చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ డేవిడ్ రాజ్ తెలిపారు .

కాగా , అరెస్టు అయిన వారిలో ఒకరిద్దరు మినహా అందరూ ప్రముఖ వ్యాపారవేత్తలే కావడం చర్చనీయాంశమైంది . పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి ఆడుతూ పట్టుబడటం నగరంలో హాట్ టాపిక్ గా మారింది . వీరి అరెస్టు విషయంలో పోలీసులు పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదుర్కొన్నట్లు సమాచారం .