పేకాట మగాళ్లేకేనా ? ఆడవాళ్లు ఆడకూడదా ? అనుమానం ఎందుకు ? మహిళల పేకాట డెన్ పై పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో పేకాడుతున్న పేకాడుతున్న ఎనిమిది మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాడేపల్లి సీతానగరంలోని పట్టాభి సీతారామయ్య కాలనీలో పేకాటస్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న ఎనిమిది మంది మహిళలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.1.36లక్షల నగదు, 8 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు గతంలోనూ ఇదే కేసులో అరెస్టయ్యారు. ఈ ప్రాంతంలో మహిళల పేకాట స్థావరాలు ఉన్నాయని తెలిసి పోలీసు నోరెళ్లబెట్టారు..