లాక్‌డౌన్ నుంచి తప్పించుకోవడానికి కొంతమంది విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. విశాఖలో కూడా ఓ జంట పోలీసులకు షాకిచ్చారు. లాక్‌డౌన్ నుంచి తప్పించుకున్నారు.. కానీ కథ అడ్డం తిరగడంతో దొరికిపోయారు. గోపాలపట్నంకు చెందిన దంపతులు బైక్‌పైబయటకు వచ్చారు. చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు ఆపడంతో.. తన బిడ్డకు సీరియస్‌గా ఉందని చెప్పారు.. పోలీసులు కూడా నిజమే అనుకుని వదిలేశారు. అక్కడి నుంచి బయల్దేరి న్యాడ్ జంక్షన్ చేరుకున్నారు.

అక్కడా పోలీసులు బైక్‌ను ఆపారు వారికి సైతం మళ్లీ అదే మాట చెప్పారు. కానీ భార్యా భర్తల తీరుపై ఓ కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చింది. ఓ సారి పాప‌ను చూస్తానంటూ మ‌హిళ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు, తర్వాత సీన్ చూసి షాక్ తిన్నాడు. మహిళ చేతిలో పాప లేదు.

ఓ బొమ్మ మాత్ర‌మే ఉంది. వెంటనే మహిళ మాట మార్చేసింది. త‌మ బంధువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పింది.ఈ ఒక్క‌సారికి అనుమతించమని కోరింది. మహిళ అడగడంతో పోలీసులు కూడా ఏమీ అనలేకపోయారు. మ‌రోసారి ఇలాంటి పిచ్చి ప‌నులు చేయొద్దని హెచ్చ‌రించి జంట‌ను వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.