గ‌త నెల 27న‌ దిశపై అత్యాచ‌రం అనంత‌రం హ‌త్య జ‌రిపిన నిందితుల‌ని ఈ రోజు తెల్ల‌వారుజామున గం.3.30 స‌మ‌యంలో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో భాగంగా పోలీసులు జ‌రిపిన ఈ ఎన్‌కౌంట‌ర్‌పై యావ‌త్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. నిందితుల‌కి తెలంగాణ ప్ర‌భుత్వం, పోలీసులు స‌రైన శిక్ష విధించార‌ని ప్ర‌తి ఒక్క‌రు చెబుతున్నారు.

దిశ కేసు విష‌యంలో తెలంగాణ పోలీసుల ప్ర‌తిభ‌పై దేశం మొత్తం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుంది. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుండి నేటి వ‌ర‌కు పోలీసులు ఎంతో చురుకుగా ప‌నిచేశారు. దిశ హ‌త్య నిందితుల‌ని కేవ‌లం 24 గంట‌ల‌లో ప‌ట్టుకున్న పోలీసులు వారి ద‌గ్గ‌ర నుండి పూర్తి స‌మాచారం రాబ‌ట్టేందుకు ప‌ది రోజుల పాటు క‌స్ట‌డీకి తీసుకున్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో వారిని పూర్తిగా విచారించిన పోలీసులు అనేక కీలక విష‌యాలు రాబ‌ట్టారు.

దిశని హ‌త్య చేసిన నిందితుల‌ని జైల్లో పెట్టి మేప‌డం వ‌ద్దు. వారిని ప‌బ్లిక్‌గా ఉరి తీయండి. అప్పుడే దిశ ఆత్మ శాంతిస్తుంద‌ని ప‌లువురు ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే ఈ రోజు ఉద‌యం పోలీసులు జ‌రిపిన ఈ ఎన్‌కౌంట‌ర్ ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఘ‌ట‌న ప్ర‌దేశంలో ఉన్న‌ పోలీసుల‌పై పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారికి స్వీట్స్ తినిపించి నోరు తీపి చేస్తున్నారు తెలంగాణ పోలీస్ జిందాబాద్ అంటూ కేక‌లు వేస్తున్నారు . అంతేకాక‌ సీపీ సజ్జ‌నార్ , తెలంగాణ పోలీస్ , సీఎం కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు.

దిశ నిందితుల ఎన్ కౌంట‌ర్ అనంతంరం న‌క్ష‌త్ర కాల‌నీలో ఆనందం వెల్లివిరిసింది. నిందితుల‌కి త‌గిన శిక్ష ప‌డింది. ఈ ఘ‌ట‌న‌తో అయిన నేరం చేయాలంటే ప్ర‌తి ఒక్క‌డ భ‌య‌ప‌డతాడు. తెలంగాణ పోలీసులు చూపిన ఈ చొర‌వ‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని కాల‌నీ వాసులు చెబుతున్నారు. ఏదేమైన దిశా ఘ‌ట‌న‌కి సంబంధించిన కేసుని 10 రోజుల‌లో పోలీసులు ఇలా ముగించడం గ‌మ‌న‌ర్హం.