{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584442155688","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584442155621","source":"other","origin":"gallery"}

భారతీయుడు-2 సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో విచారణకోసం రావాలంటూ పోలీసులు తనను వేధిస్తున్నారని వాపోయారు హీరో కమల్ హాసన్. వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ‘భారతీయుడు’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఐతే ఈ సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటన సిని చరిత్రలోనే అతి భయంకరమైనది. చైన్నైలోని ఈవీసీ స్టూడియోలో లైటింగ్ కోసం సెట్ వేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. 150అడుగుల ఎత్తు నుంచి క్రేన్ కింద పడింది. ఈ ప్రమాదంలో శంకర్ రైట్ హ్యండ్ మధు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్ మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.

అయితే ఇది జరిగిన సమయంలో డైరెక్టర్ కూడా ఆ సమీపం లోనే ఉన్నాడు. అయితే ఆయనకు మాత్రం ఏం కాలేదు. షూటింగ్ సమయం లో అనుమతి ఉన్న దానికంటే ఎక్కువ పొడుగునా క్రేన్ వాడరు అని పోలీసులు అంటున్నారు. అయితే మిమ్ము అనుమతికి మించిన క్రేన్ ఉపయోగించలేదు అని చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు కమలహాసన్, అలాగే డైరెక్టర్ శంకర్ ను పలుమార్లు విచారణ కోసం పిలిచారు. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ వేశారు కమల్ హాసన్.