మోడల్ రిచా సింగ్, హీరోయిన్ అమృతా ధనోవ్ (32) అరెస్టు

పక్కా స్కెచ్ వేసి, సినీ ఫక్కీలో ఓ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గట్టు రట్టు చేశారు పోలీసులు. తామే కస్టమర్లుగా మారి దాని వెనుక ఎవరున్నారో కనిపెట్టారు. ఆ సెక్స్ రాకెట్ బారి నుంచి ఇద్దరు అమ్మాయిల్ని కాపాడారు. అక్రమంగా ఆడపిల్లల్ని ఈ వ్యభిచార కూపంలోకి లాగుతున్న ఓ మోడల్‌ను, ఓ హీరోయిన్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలో గురువారం రాత్రి జరిగింది.

ముంబైలోని గోరెగావ్ ఈస్ట్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా తమ వ్యవహారాల్ని నడుపుతున్నట్లు లోకల్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. అయితే కస్టమర్లనో, లేదా మహిళల్నో కాకుండా అసలు దీని వెనుక ఎవరున్నారన్నది కనిపెట్టి, వారిని అరెస్టు చేయాలని ప్లాన్ వేశారు. జోనల్ డీసీపీ స్వామి ఆధ్వర్యంలో టీమ్ ఆ హోటల్‌కు వెళ్లింది. వారిలో కొందరు కస్టమర్లుగా మారి విషయం కూపీలాగారు. వాళ్ల దగ్గరకు వచ్చిన ఇద్దరు అమ్మాయిలను రక్షించి, రెస్యూ హోమ్‌కు తరలించారు. వాళ్లను సప్లై చేస్తున్న మోడల్ రిచా సింగ్, హీరోయిన్ అమృతా ధనోవ్ (32)లను అరెస్టు చేశారు. వారిపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పెట్టి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు డీసీపీ స్వామి.