వరంగల్ కమిషనరేట్ పరిధిలో కరోనా వ్యాధి సోకిన అనుమానితులను హస్పటల్స్ కు తరలిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యక్తిగత రక్షణను దృష్టిలో పెట్టుకోని రోటరీ క్లబ్ హన్మకొండ విభాగం సభ్యులు తమ వంతు సహకారంగా 50పైగా వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లతో పాటు సానిటైజర్లను ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ కు అందజేసారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కరోనా వ్యాధిని కట్టడి చేయడంలో ప్రజల సహకారం అవసరమని ముఖ్యంగా ప్రభుత్వం, పోలీసులు సూచనలను పాటించడం ద్వారా కరోనా వ్యాధి తరిమిగొట్టగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డి.సి.పి వెంకటలక్ష్మి , రోటరీ క్లబ్ హన్మకొండ విభాగం అధ్యక్షుడు కన్నారెడ్ది సభ్యులు డా. ప్రవీణ్ కుమార్, డా. శ్రీ రాములు, విజయ్, నరేష్ తదితరులు పాల్గోన్నారు.