భాగ్యనగరంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కరోనా వైరస్ ప్రగతిభవన్‌ను తాకింది. వారం రోజుల్లో దాదాపుగా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతిభవన్‌ను శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనా కట్టడికి కేవలం లాక్‌డౌనే పరిష్కారం కాదని ప్రభుత్వం వెనక్కితగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.