ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2020 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపేందుకు పచ్చే ప్రతి ఒక్కరూ, పుష్పాగుచ్చాలకు, శాలువాలకు బదులుగా బ్లాంకెట్లను తీసుకొని రావాలని జిల్లా ఎస్.పి. గారు తెలిపారు.

ఇలా తీసుకొని వచ్చిన వాటిని ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాలలో విధ్యనభ్యసించే పేద విధ్యార్థులకు అందజేయడం జరుగుతుందని అన్నారు, కావున శుభాకాంక్షలు తెలిపేందుకు పచ్చే ప్రతి ఒక్కరు వీటిని తీసుకునివచ్చి పేద విధ్యార్థులకు సహాయపడాలని అన్నారు. అలాగే మెదక్ జిల్లా పరిదిలో ఎక్కడైనా సమస్యలు ఎదురైనా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా,

వస్తువులు కనపడినా వెంటనే మెదక్ జిల్లా పోలీసు వాట్స్ ఆప్ నెంబర్ 7330671900 కానీ, మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లైనటువంటి 08452223533, 08452221667, లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అపశృతి లేకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్‌ 100, లేదా దగ్గరలోని పోలీసు స్టేషన్ కి సమాకారం అందించాలని, జిల్లా ప్రజలంతా నూతన సంవత్సర వేడుకలని కుటుంబ సబ్యులతో ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు.