భద్రకాళి చెరువుకు గండి పడిందనీ నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగర మేయర్ శ్రీమతి. గుండు సుధారాణి తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ.ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, లోక్‌సభ సభ్యులు పసునూరి దయాకర్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో పాటు ఇరు జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, బల్దియా కమీషనర్, ఇంజనీరింగ్ అధికారులు ఉదయం నుండి గండి పడ్డ ప్రాంతంలోనే ఉండి గండిని ఆపేలా చర్యలు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఏవి.రంగనాథ్, హన్మకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా తదితరులు పాల్గొన్నారు…
!! ప్రజలు ఆందోళన చెందవద్దు !!
భద్రకాళి చెరువు కు గండి పడిందనీ నగర ప్రజలు ఆందోళన చెందవద్దు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ శ్రీ.బండ ప్రకాష్, చీఫ్ విప్ శ్రీ.వినయ్ భాస్కర్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో పాటు ఇరు జిల్లాల కలెక్టర్లు,… pic.twitter.com/PeEl3PgMGU
— Gundu SudhaRani, GWMC MAYOR (@SudhaRani_Gundu) July 29, 2023