ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ (అంతర్జాలం)తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసేస్తున్నారు. చేతిలొ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి వస్తువునైనా తెల్లారేసరికల్లా ఇంటి ముందుకు వచ్చేస్తోంది. అయితే కొన్నిసార్లు ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు కూడా జరుగుతుంటాయి. బుక్ చేసిన ప్రొడక్ట్ కాకుండా ఇతర డమ్మి ప్రొడక్ట్ లు వచ్చేస్తుంటాయి, ఇలాంటి ఆన్ లైన మోసాల సంఘటనలు సోషల్ మీడియాలో తరచూ జరుగుతున్నాయి, కాబట్టి ప్రజలు సైబర్ నేరగాళ్ళు చూపే మోసపూరితమైన ఆశలకు, మోసాలకు గురికావొద్దని, తాము కష్టపడి సంపాదించే డబ్బును అనవసరంగా సైబర్ నేరగాళ్ళ పాలుచేసుకోవద్దని జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి.ఐ.పి.ఎస్. గారు అన్నారు.

ఈ సంధర్భంగా జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతూ: కొంతమంది సైబర్ నేరగాళ్ళు సామాన్య పేద ప్రజలను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో ఆహారం, మరియు ఇతర ఖరీదైన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల విక్రయం, ఆఫర్ల పేరిట దోచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకే వస్తువులంటూ ఆశచూపి సైబర్ నేరగాళ్ళు మరో కొత్తరకం మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మార్కెట్లో లక్ష రూపాయలు అమ్మే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా 90శాతం తగ్గింపు, వన్ ప్లస్ వన్ వంటి ఆఫర్లు చూపడం, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ డెలివరీ సంస్థల సైట్స్ ని సైతం హ్యాక్ చేసి ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ లలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పేరుతో 90శాతానికి పైగా ఆపర్లు పెట్టాయి అని చూపిస్తారు.

ఈ సైట్లపై క్లిక్ చేస్తే నిజంగానే సైట్ ఓఫైన్ అవుతుంది, ఒక్కసారి ఈ సైట్ పై నొక్కగానే గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్స్ లో చెల్లించాలని అడుగుతారు, వారు అడిగిన డబ్బులు ఒకసారి చెల్లిస్తే వారి చేతుల్లో మోసపోవడం ఖాయం కాబట్టి ప్రజలు ఆన్ లైన్లో మోసగాళ్ల చూపే మోసపూరిత ఆశలకు మోసపోకుండా ప్రజలు తమ యొక్క కష్టార్జితాన్ని కాపాడుకోవడం కొరకు, సామాజిక మాధ్యమాల ద్వారా యువతీ యువకులు చెడు దారి పట్టకుండా ప్రత్యేక శ్రద్ధ వహంచవలసిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉన్నదని జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు సూచించారు.