{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595348745987","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595348682145","source":"other","origin":"unknown"}

ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పనిచేయండి వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్, ఐపిఎస్ ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పనిచేయడం ద్వారా ప్రజలకు పోలీసుల పట్ల ప్రజలకు అభిమానం , గౌరవం పెరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమీషనర్అధ్వర్యంలో ఈస్ట్ జోన్ కు చెందిన పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం పోలీస్ కార్యాలయములో నిర్వహించారు. కరోనా వ్యాధి దృష్యా జోన్లవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలనే ఆలోచనతో మొదటగా ఈస్ట్ జోన్ కు చెందిన పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డి.సి.పి, ఎ.సి.పి, ఇనెన్స్ స్పెక్టర్లు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారిగా పోలీస్ అధికారుల పనీతీరుతో పాటు కేసుల నమోదు వాటి పరిష్కరణ, నిందితుల అరెస్టులు మరియు కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమీషనర్ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ ప్రతి పోలీస్ అధికారి బెసిక్ పోలీస్ డ్యూటీలను మరువద్దని, నేరం జరిగినప్పుడు అధికారులు తప్పనిసరిగా నేరస్థలాన్ని సందర్శించి నేరానికి గల కారణాలపై తగు విచారణ చేపట్టాలని, విధి నిర్వహణలో అధికారులు ఆలసత్వం వహించవద్దని.

డివిజనల్ స్థాయి అధికారులు డివిజన్ పరిధిలో పోలీస్ అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి నమోదయిన కేసుల దర్యాప్తు సమాచారాన్ని పరిశీలించాల్సి వుంటుందని. నైపుణ్యంతో పనిచేయడం ద్వారా భవిష్యత్తు తరాల పోలీస్ అధికారులకు అదర్శంగా నిలవడంతో పాటు, ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.శాంతి భద్రతలకు సంబంధించి పోలీస్ కమిషనర్ ప్రస్తావిస్తూ మిస్సింగ్ కేసులను అధికారులు సైబర్ విభాగం సహకారంతో పరిష్కారించాల్సి వుంటుందని. పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్ల స్థితిగతులు మరియు వారి అనుచరుల వివరాలతో పాటు వారి అదాయ వనరులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని, అధే విధంగా భూకజ్జాలు, బెదిరించి డబ్బు వసూళ్ళకు పాల్పడటం, కిడ్నాపులు లాంటి చట్టవ్యతి రేక కార్యకలపాలకు పాల్పడటంతో పాటు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిపై రౌడీ షీట్ తెరవాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు అదేశించారు. ముఖ్యంగా నేరాలను నియంత్రించడంతో పాటు తమ వ్యక్తిగత భద్రత కోసం ప్రజలు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోనే విధంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన భాధ్యత పోలీస్ అధికారులపై వుందని. రోడ్డు ప్రమాదాలను నియంత్రణ కోసం అధికారులు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో వెజొన్ ఇంచార్జ్ డి.సి.పి వెంకటలక్ష్మీ, స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పి జనార్థన్, పర్కాల, మామూనూర్ ఎ.సి.పిలు శ్రీనివాస్, శ్యాంసుందర్ తో పాటు ఇన్స్ స్పెక్టర్లు, సబ్-ఇన్స్ స్పెక్టర్లు పాల్గొన్నారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము