జిల్లా ఎస్పీ కుమారి చందన దీప్తి ఐపీఎస్ గారి ఆదేశానుసారం మెదక్ రూరల్ పి.ఎస్. పరిధిలోని పాతుర్ గ్రామంలో సాయంత్రం 04:30 నుండి 07:00 వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా ఎస్.పి కుమారి చందన దీప్తి ఐపీఎస్ గారి ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి. కృష్ణమూర్తి, 3 సిఐలు, 08 గురు ఎస్సైలు, సిబ్బంది మొత్తం 60, 150 ఇళ్లను, సుమారుగా 250 మంది వ్యక్తులను, ద్విచక్ర వాహనాలను, అనుమానితులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా తగిన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఒక ఎక్ష్సైజ్ కేసును చేయడం జరిగినది దీనిలో 10 బీరు బాటిళ్ళు, 7 క్వాటర్ బాటిళ్ళు సిజు చేయడం జరిగినది, అలాగే ఓకే గేమింగ్ యాక్ట్ కేసును కుడా చేయడం జరిగిందని ఇందులో 1600 రూపాయలను మరియు 5గురిని అదుపులో తీసుకోవడం జరిగినదని ఎస్.పి. గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎస్.పి కుమారి చందన దీప్తి ఐపీఎస్ గారు మాట్లాడుతూ: పాతూరు గ్రామంలో గత 5 సంవత్సరాల నుండి ఎలాంటి దొంగతనం కేసులు నమోదు జరగక పోవడం చాల సంతోషకరమని, అదేవిధంగా గ్రామంలో రైతుల యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు, వారి పంట పొలాల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు, అదేవిధంగా కల్తి విత్తనాల గురించి మాట్లాడుతూ ప్రతి రైతు కల్తి విత్తనాలపై అవగాహన కల్గివుండాలని, ఒక వేళ ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని లేదా సమీపంలో గల పోలిస్టే స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. అలాగే ప్రజలు అందరు చట్టానికి లోబడి తమ పనులు చేసుకోవాలని, పోలీస్ వారు ఎల్లపుడు వీరికి సహాయకంగా వుంటూ వీరికి వెన్నంటే ఉంటామని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని కల్గించుటకై వారికి చట్టాలపై అవగాన కల్పించడం జరిగినది, జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడు ప్రజల భద్రత కొరకే పనిచేసున్నదని, ప్రజలు పోలీసులను మంచి స్నేహితులుగా భావించి వారికి చట్టపరమైన సమస్యలు వచ్చినపుడు పోలీసులను సంప్రదించాలని కోరారు. ఆ తర్వాత పిల్లలతో మాట్లాడుతూ మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అనవసరంగా చెడు వ్యసనాలకు బానిస అయి తమ జీవితాలను పాడుచేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమం ప్రజల సహకారంతో నిర్వహించడం జరిగిందని ఇలాంటి కార్యక్రమాల వల్ల అసాంగీక కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని తెలిపినారు. అదేవిదంగా ఇళ్ళల్లో కిరాయికి వచ్చేవారి పూర్తి వివరాలు ఇంటి యజమాని తీసుకోవాలని, వారి యొక్క గుర్తింపు కార్డ్ లను తప్పనిసరిగా తీసుకోవాలని తద్వారా ఏదైనా సంగటన జరిగినప్పుడు వారిని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపినారు. తాము నివసించే ప్రదేశాలలో అనుమానంగా ఎవరైనా కనిపించినా డయల్ 100 కి గాని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి తెలియజేస్తే వెంటనే చర్యలు చేపడతారని తెలిపారు. ఈ రోజు ద్విచక్ర వాహనాలను యజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ లు శ్రీ. వెంకట్ మెదక్ టౌన్ సీఐ గారు, శ్రీ రాజశేకర్ మెదక్ రూరల్ సీఐ గారు, శ్రీ రవిందెర్ రెడ్డి అల్లాదుర్గ్ సీఐ గారు మరియు ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.