{"subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1597814345285","source":"other","origin":"gallery","sources":["274130406034211"],"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1601048850106"}

ప్రజల మేలుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలనా సంస్కరణలు చేపట్టారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రదాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఆర్.ఐ లు,ఎమ్మార్వోలతో కొత్త రెవెన్యూ చట్టం పై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కమీషనర్ పమేల సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించారు, రెవెన్యూ చట్టంపై అధికారులకు దిశానిర్దేశనం చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: పేదలకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతోనే కొత్తరెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకువచ్చారన్నారు అమలు క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆస్థి పలాన వ్యక్తిది అనడానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాత్రమే ఆదారంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న మ్యూటేషన్, దరణి ఫోర్టల్ లో పొందుపర్చడం ద్వారా సంబందిత వ్యక్తికి పూర్తిగా ఆస్తులపై చట్టబద్దమైన హక్కులు కల్పించబడతాయన్నారు.

దశాబ్దాలుగా సామాన్యులు అనేక ఆస్థుల వివాదాలు ఎదుర్కొంటున్నారని,వాటి శాశ్వత పరిష్కారం కొరకు ఈ చట్టం ఉపకరిస్తుందన్నారు పేదల భూములు దరణి వెబ్ సైట్ లో సురక్షితంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ సూచనకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి, పారదర్శకమైన పాలన అందించేందుకే కొత్త రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకువచ్చారు పేదవారికి తెలిసేలా వివరించి ప్రతీ డివిజన్ లో ఇండ్ల స్థలాలు, భూములు క్రమబద్దీకరించి ఉన్నాయో లేదో తెలుసుకోవాలి, ఒకవేల క్రమబద్దీకరించని వాటిని క్రమబద్దీకరించాలి అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజల ఆస్తులను ఆన్ లైన్ చేసుకునే విదంగా చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క పేదవారు నష్టపోవద్దని ఈ ప్రక్రియ చేపట్టారు సమగ్రంగా సర్వే చేపట్టాలి, అడ్డదిడ్డంగా ఉన్న రికార్డులను సరిచేయాలి ఓపెన్ ప్లాట్స్, గృహాలు అన్ని గుర్తించి ఆన్ లైన్ చేయాలి, వాటిని గుర్తించక పోతే యాజమానులు నష్టపోయే అవకాశం ఉంది, ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు వీలుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలిచే నిర్ణయం, అదికారులంతా సమన్వయంతో పనిచేసి ఒక్క ఇంచు భూమి కూడా వివాదాలు లేకుండా ఆన్ లైన్ చేయాలని అదికారులకు ఎమ్మెల్యే సూచించారు..