మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు క్లిష్టమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేరేనాటికి తనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. అంతే కాకుండా తనకు సన్నిహితంగా వ్యవహరించిన వారు పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణబ్ తొందరగా కోరుకోవాలని ఆకాంక్షించారు.