ప్రణయ్ భార్య అమృతకు వేధింపులు ఆగడం లేదు. ప్రణయ్‌ను మరచిపోవాలని అమృతకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఈ నెల 11న ప్రణయ్‌ వర్ధంతి రోజున డోర్‌కు అగంతకుడు లెటర్‌ అంటించి వెళ్లినట్లు తెలిసింది. ఇకనైనా ప్రణయ్‌ను మర్చిపోవాలని ఆ లేఖలో ఉన్నట్లు అమృత తెలిపింది. ఆమెను మరింత మానసిక వేదనకు గురిచేసేందుకు ఇలా చేస్తున్నారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రణయ్ హత్యకు గురైన సమయంలో అమృత గర్భవతి. కొన్నాళ్లకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ అత్తింట్లో ఉంటున్న అమృత తాజా బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేసింది. బెదిరింపులపై ప్రణయ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.