ఈ రోజు తేదీ:15-08-2019 నాడు 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఉదయం 09.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయగీతాలాపన చేసారు. అనంతరం ఎస్.పి. గారు మాట్లాడుతూ! జిల్లా ప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మరియు పవిత్ర రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన ఈ స్వేచ్చ, స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని, వారి ప్రాణ త్యాగాలవలనే మన మందరం ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవము జరుపుకుంటున్నాము కావున మనము కుడా మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి జిల్లా పోలీస్ వ్యవస్తకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. శ్రీ. ఏం. మహేందర్ రెడ్డి ఐ.పి.ఎస్. గారి ద్వారా వీధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ సేవా పతకాలకు ఎంపిక అయిన 8 మంది మెదక్ జిల్లా పోలీస్ సిబ్బందికి మెదక్ జిల్లా ఎస్.పి. గారు ఈ పాతకాలను ప్రదానం చేశారు. ఈ సేవా పతకాలు పొందిన సిబ్బంది పేర్లు: 1) శ్రీ. గోవర్ధన గిరి(ఇన్స్పెక్టర్ ఐ.టి.సెల్ మెదక్), 2)శ్రీ. సయ్యద్ ఖధీరోద్దీన్ (ఆర్.ఎస్.ఐ. మెదక్), 3) శ్రీ. ఏం.డి. లాయక్ అలీ ( హెడ్ కానిస్టేబుల్ ఐ.టి.సెల్ మెదక్),4 శ్రీ. కె. విజయ్ కుమార్ ( కానిస్టేబుల్ ఐ.టి.సెల్ మెదక్), 5) శ్రీ. ఎస్. లక్ష్మీనాయారణ(కానిస్టేబుల్ డి.ఎస్.బి. మెదక్),6) శ్రీ. ఎల్.భీమేష్ (కానిస్టేబుల్ డి.ఎస్.బి. మెదక్), 7) శ్రీ. టి.భూమన్న (కానిస్టేబుల్ మెదక్ డి.ఎస్.పి. ఆఫీసు), 8) శ్రీ. ఏం డి. తాహెర్ (కానిస్టేబుల్ హవేలిఘన్పూర్ పి.ఎస్.). ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి. శ్రీ కృష్ణ మూర్తి గారు, సి.ఐ.లు ఎస్.ఐ.లు డి.పి.ఓ సిబ్బంది, ఐ.టి. కోర్ సిబ్బంది, ఎస్.బి. సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.