{"source_sid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1610419410168","subsource":"done_button","uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1610419410016","source":"other","origin":"gallery","sources":["319181531267201"]}

వీధి వ్యాపారులకు రుణాల మంజూరులో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ప్రధాని నరేంద్రమోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిని వెనక్కి నెట్టి గ్రేటర్‌ వరంగల్‌ మొదటిస్థానానికి ఎగబాకింది. 22,719 మందికి రుణాలు అందించి వరంగల్‌ నంబర్‌వన్‌గా నిలువగా 22,542 మందితో వారణాసి రెండో స్థానానికి పరిమితమైంది.

రాష్ట్రంలో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి రుణాలకు అర్హులైన వ్యాపారులను గుర్తించారు. జనవరి 15 నాటికి అర్హులను ఎంపికచేసి, జనవరి 22లోగా ఎంపికైన వారందరికీ రుణాలు అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. పీఎం స్వనిధి పథకం అమలులో పని తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 26న అవార్డులను ప్రదానం చేయనుంది.