• • ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని నగరాల మేయర్ లతో వర్చువల్ సమావేశం..
  • • నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారిని అభినందించిన ఇక్లి ప్రతినిధులు..

ఇక్లి (ఐసిఎల్ఈఐ) గ్లోబల్ సర్క్యులర్ డెవలప్‌మెంట్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ ప్రాంతీయ సూక్ష్మ నైపుణ్యాలను అమలు చేయడానికి వివిధ దేశాలలోని నగరాల మేయర్ లతో ఇక్లి వర్చువల్ గా నిర్వహించిన లోకల్ గవర్నమెంట్స్ ఫర్ సస్టైనబుల్ గ్లోబల్ సమ్మిట్ స్టాటిజిక్ ప్రోగ్రాంలో భాగంగా గ్లోబల్ సర్క్యులర్ స్టాటిజిక్ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు వర్చువల్ గా పాల్గొని నగరంలో చేపట్టిన, చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ:

మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంటు (ఎఫ్.ఎస్.టి.పి) దేశంలోనే తొలిసారిగా నగరంలోని అమ్మవారిపేటలో ఏర్పాటు చేయడం జరిగిందని, నగర అవసరాల దృష్ట్యా 150 కెఎంఎల్‌డి. సామర్థ్యంతో మరొక ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బయోమైనింగ్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్.టి.పి) లను ఎంజిఎం ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని, 750 కేఎల్డి సామర్థ్యంతో రూ.200 కోట్ల వ్యయంతో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో రెడ్డిపురంలో, 15 ఎంఎల్డీ సామర్థ్యంతో ప్రగతి నగర్ లో మరియు 5 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉర్సు గుట్ట ప్రాంతంలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నిర్ములనకై పటిష్టచర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ కట్టడికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నామని, నగరంలోని 6 చోట్ల ఖాళీ ప్రాంతాలను గుర్తించి పార్క్ లు ఏర్పాటు చేశామని మేయర్ గుండు సుధారాణి తెలిపారు.

వరంగల్ కార్పొరేషన్లో చేపడుతున్న పైన తెలిపిన వినూత్న కార్యక్రమాలను ఇక్లి వరల్డ్ ప్రతినిధులు ప్రశంసిస్తూ మేయర్ గుండు సుధారాణి గారిని అభినందించారు. ఈ వర్చువల్ సమావేశంలో పలు దేశాలలోని మేయర్లు చారిస్ హాఫ్మన్, మగష్ నేడో, డేనియల్ అడెనియి (ఆఫ్రికా), జకియా అట్కిన్స్ (ఈ. ఎన్), సాల్ రౌక్స్, జువాన్ (తూర్పు ఆసియా), యింగ్-చిహ్ డెంగ్- (సోమర్), మరియా అలోన్సో (జోకుడు), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డ్రెయినేజీ), సూరత్ స్టీవ్ గావ్లర్ (ఓషియానియా), జోకుడు (ఇక్లి- ఆఫ్రికా), అరి మోచా(జకార్తా), బోగోర్ (ఇండోనేషియా) తదితరులు పాల్గొన్నారు.