నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా వా.. డుగ్గు.. డుగ్గు.. డుగ్గు.. సోషల్ మీడియా అన్ని ఫ్లాట్ ఫాంమ్స్ లో దుమ్మురేపుతున్న ఈ పాటపై ఎవ్వరు డాన్స్ చేసిన విపరీతమైన వ్యూస్ తో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల పెళ్లి కూతురి డ్యాన్స్ తో వైరల్ అయిన ఈ పాట ఓ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాటలో మంచి మీనింగ్ ఉండటంతో చూసే వాళ్లు కూడా ఎంకరైజ్ చేస్తూ లైకులు, షేర్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ డుగ్గు డుగ్గు సాంగ్ పెళ్లి కూతురి డ్యాన్స్ తో వైరల్ కాగా, తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో నర్సు ఈ పాటతో డాన్స్ చేసి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేడుకలు ముగిశాక తోటి నర్సులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా నర్సు డాన్స్ చేసినట్లు తెలుస్తుంది.

ఆమె డాన్స్ చేస్తుండగా మిగతా నర్సులు చప్పట్లతో ఎంకరైజ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింతో తెలియదు కానీ. ఇప్పుడు ఈ పాట కూడా మరింత వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ఈ సాంగ్ పై డాన్స్ చేస్తూ మరెంత మంది కళాకారులు వెలుగులోకి వస్తారోనంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.