విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆర్డీవో క‌నుగుల‌ హేమ‌ల‌త ప్రభ జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అతి సామాన్యురాలిగా ఆధార్‌కార్డు పట్టుకొని గురువారం సాయంత్రం ఆమె ఘోషా ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిని కలిశారు. వారు ఆమెని వెంటనే ఆస్ప‌త్రిలో చేర్చుకున్నారు. ఆమె ఆర్డీవో అని గంట తర్వాత అక్కడి సిబ్బంది గుర్తించారు. ప్రసవానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. రాత్రి 11.54 గంటలకు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.