ప్రజలందరూ దేవుడి తర్వాత దేవుడిలా కొలిచేది ఒక్క డాక్టర్ ని మాత్రమే. ఇక కరోనా సమయంలో వారు చేసిన సేవలు నిజంగా దేవుడిని తలపిస్తున్నాయి కూడా తిండి, నిద్ర, కుటుంబం అన్నింటిని వదిలి సేవ చేసిన వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ కామాంధుడిగా మారాడు. తన వద్ద పనిచేసే నర్స్ నగ్న వీడియోలను తీసి, తన కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. తన కోరికను ఒప్పుకోకపోవడంతో నగ్న వీడియోలను ఆమె భర్తకు చూపించి రాక్షసానందం పొందిన ఓ డాక్టర్ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే: యూపీలోని రాంపూర్ జిల్లా షాబాద్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో ఓ వ్యక్తి డాక్టర్(45) గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే హాస్పిటల్ లో ఓ మహిళ(37) నర్సు గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నిరోజులుగా నర్సును డాక్టర్ లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.

తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన దగ్గర ఆమె స్నానం చేస్తుండ‌గా రికార్డు చేసిన వీడియో ఉందని, తన మాట వినకపోతే ఆ వీడియోలను తన భర్తకు పంపుతానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. అయినా తాను లొంగకపోయేసరికి ఆ వీడియోలను తన భర్తకు పంపాడని, అవి చూసి తన భర్త విడాకులు ఇచ్చాడని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నర్సుకి డాక్టర్ కి వివాహేతర సంబంధం ఉందా ? వారిద్దరి మధ్య గొడవలు వలనే ఆమె ఇలా ఆరోపిస్తుందా.? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.