అగ్ని ప్ర‌మాదానికి గురైన క‌ళ్యాణ‌ల‌క్ష్మీ షాపింగ్ మాల్ ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప‌రిశీలించారు. అగ్ని ప్ర‌‌మాదానికి కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంత మేర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని అడిగారు.

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ య‌జ‌మానుల‌ని ప‌రామ‌ర్శించారు. ఇలాంటి ప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని, షాప్స్ య‌జ‌మానులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకునేలా చైత‌న్య ప‌ర‌చాల‌ని పోలీసు అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.