{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579762980308","total_editor_time":79,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579762835633","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

తేది:22.01.2020 నాడు మెదక్ జిల్లాలో జరిగిన నాలుగు మున్సిపల్ పరిధిలోని ఎన్నికలు 146 పోలింగ్ స్టేషన్స్, 60 పోలింగ్ లొకేషన్ లలో జరిగినవని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ: ఓటు వేయటం మన ప్రాధమిక బాధ్యతని ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఈరోజు వరకు ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో సహకరించిన అన్ని శాఖల సిబ్బందికి, ముఖ్యంగా మెదక్ జిల్లా పోలీస్ సిబ్బందికి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందికి పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినారు.

ఈ మున్సిపల్ ఎన్నికలలో మెదక్ మున్సిపాలిటిలో 82.01 శాతం పోలింగ్ నమోదు అయినదని, రామాయంపేట్ మున్సిపాలిటిలో 89.00 శాతం పోలింగ్, నర్సాపూర్ మున్సిపాలిటిలో 78.09 శాతం, తూప్రాన్ మున్సిపాలిటిలో 82.00 శాతం పోలింగ్ నమోదు అయినదని జిల్లా మొత్తంగా 82.12 శాతం పోలింగ్ నమోదు అయినదని తెలిపినారు. అలాగే మెదక్ జిల్లా మున్సిపాలిటిలో పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఎన్నికల నియమావళి అతిక్రమించిన వారిపైన మెదక్ మున్సిపాలిటిలో మూడు కేసులు, తూప్రాన్ మున్సిపాలిటిలో రెండు కేసులు, నర్సాపూర్ మున్సిపాలిటిలో ఒక కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపినారు. అదేవిధంగా ఈరోజు ఎన్ని ఇతర పనులు ఉన్నప్పటికీ దాదాపు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు వినియోగించుకున్నారని ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు జరిగిందని, ఈ ఎన్నికలను జిల్లా యెస్.పి గారు జిల్లా కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది.

ఈ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కురు వృద్ధులైన వికలాంగులైన ఓటర్లకు పోలీస్ సిబ్బంది స్వయంగా దగ్గరకు వెళ్లి వారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రంలోకి పంపి ఓటు వేయించడంతో పాటు ప్రజలకు సహాయంగా ఉంటూ తమ విదులను నిర్వహించడం జరిగిందని, ఈ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడంలో HG స్థాయి అధికారిని నుండి ఉన్నత స్థాయి అధికారితో పాటు తమ యొక్క విధి నిర్వహణను అంకితభావంతో నిబద్ధతతో చేసినారని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలిపినారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు నిర్వహించిన సిబ్బందిని కొనియాడినారు. విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేసిన ఎన్నికలకు సహకరించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపినారు. ఈ ఎన్నికల బందోబస్త్ లో అదనపు యెస్,పి శ్రీ.డి. నాగారాజు గారు తూప్రాన్ డి.యెస్,పి శ్రీ కిరణ్ కుమర్ గారు ,మెదక్ డి.యెస్.పి శ్రీ. కృష్ణమూర్తి గారు, ఏ.ఆర్ డి.యెస్,పి శ్రీ. శ్రీనివాస్ గారు, రామాయంపేట్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ డి.యెస్.పి శ్రీ.ఎర్న గారు, మరియు జిల్లా యెస్,బి సి.ఐ శ్రీ విజయ్ కుమార్ గారు, ఎన్నికల బందోబస్త్ సిబ్బంది పాల్గొన్నారు..