మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ: ఈ నెల 22 జరగబోయే మెదక్ జిల్లాలో కల నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికల నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తుతో పాటు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకోసం సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించడంతో పాటు, ఎన్నికల సమయంలో గోడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఏవరైనా పాల్పడితె వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని తెలిపినారు. అలాగే ప్రణాళికతో కూడినటువండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా తెలుసుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లి అధునాతనమైన ట్యాబ్ లో ఫోటోలు చిత్రీకరించి అధికారులు పోలీస్ సిబ్బంది కలసి జియో ట్యాగింగ్ పూర్తి చేసినారని.

దీనివల్ల పోలింగ్ కేంద్రంలో ఏదైనా సంఘటన జరిగితే సత్వరమే పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకొని తగు చర్యలు చేపడుతుందని, ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున ఎవరైనా ఎన్నికల కోడ్ కి విరుద్దంగా ప్రచారం నిర్వహిస్తే వారిపైన ఎన్నికల నియమావళి ప్రాకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకున్నదని ఎస్.పి. గారు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు పోలీసు శాఖ అన్నివిధాలా ఏర్పాట్లు చేసిందని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్.పి. గారు తెలిపారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎస్పి గారు పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే, ఎవరైనా రాజకీయ పార్టీల వారు డబ్బు / మద్యం పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లైతే వెంటనే క్రింది నెంబర్ లకు ఫోన్ చేసి సమాచారం నేరుగా మెదక్ జిల్లా పోలీసు వాట్సాప్ నెంబర్ 7330671900, లేదా మెదక్ 9490617045 , రామాయంపేట్ – 9490617018 , తూప్రాన్ -9490617016 , నర్సాపూర్ – 9490617017, డయల్ 100, లేదా మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లైనటువంటి 08452223533, 08452221667, లకు ఫోన్‌ చేసి పిర్యాదు చేసినచో విచారణ జరిపి తప్పు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యెస్.పి గారు తెలిపినారు.

ఈ ఎన్నికలను అన్నీ శాఖల సమన్వయంతో (ఇన్సిడెంట్ ఫ్రీ) ఎలాంటి చిన్న సంఘటన జరుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి పౌరులు స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు చేసామని , ఓటు విలువ గురించి మున్సిపాలిటీ వార్డులలో పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరియు పోలీస్ కళాబృందం కార్యక్రమం ద్వారా ప్రచారం చేస్తున్నాం అతి సమస్యాత్మక కేంద్రాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాం ఎక్కడ ఏ విధమైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం, మరియు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు అధికారులకు పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేయుచున్నారు ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అని యెస్.పి గారు తెలిపినారు.

మున్సిపల్ ఎన్నికల బందోబస్త్ సిబ్బంది వివరాలు:

01 యెస్.పి ,01 అదనపు యెస్.పి, 04 డి.యెస్.పి లు,10 మంది సి.ఐ లు,43 మంది యెస్.ఐ లు/ఆర్. యెస్.ఐ లు,93 మంది ఎ.యెస్.ఐ లు/హెడ్ కానిస్టేబుళ్లు,306 మంది కానిస్టేబుళ్లు/మహిళా కానిస్టేబుళ్లు ,176 మంది ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ , 151 మంది హోంగార్డ్స్/మహిళా హోంగార్డ్స్ మొత్తం 785 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

రాజకీయ పార్టీ నేతలకు విజ్ఞప్తి:

  • ఈ రోజు తో అనగా తేది 20.01.2020 సాయంత్రం 05 గంటల నుండి ఎన్నికల ప్రచారం ముగిసినందున, జిల్లాలో ఎటువంటి ప్రచారం, ర్యాలీలు మరియు సమావేశాలు నిర్వహించరాదు. ఎటువంటి మైకులు మరియు లౌడ్ స్పీకర లు ఉపయోగించిన చర్యలు తీసుకొనబడును. ఎన్నికలు జరుగు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ పరిధిలో ప్రజలను మభ్య పెట్టుటకు ఎటువంటి ప్రచారం చేయరాదు.
  • పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ పరిధిలో ఎటువంటి మైకులు, స్పీకర్ లు మరియు మెగా ఫోన్ లు వాడరాదు.
  • పోటిచేయు అభ్యర్తులు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఒక టేబుల్ , 2 కుర్చీలు, ఎటువంటి టెంట్ లేకుండా సంబంధిత అధికారుల అనుమతితో పెట్టుకొనవచ్చు ఫ్లెక్సీ 3×1.5 ఫీట్ గల ఒక ఫ్లెక్సీ ని మాత్రామే ఉపయోగించవలెను.