మెదక్ పట్టణంలో గల సి.ఎస్.ఐ. చర్చ్ లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు అన్నారు. ఈ రోజు జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారి ఆదేశానుసారం మెదక్ డి.ఎస్.పి. పి. కృష్ణ మూర్తి గారు , మెదక్ టౌన్ సి.ఐ. శ్రీ. వెంకట్ గారు డ్రోన్ కెమెరాతో చర్చ్ లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్త్ ను పరిశీలించడం జరిగినది. ఆసియాలోనే అతిపెద్ద చర్చి మెదక్ లో వుందని, దీనిని చూసేందుకు, ప్రార్థనలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు సందర్శించడం జరుగుతుందని, కావున ఈ జాతరలో భక్తులకు ఆటంకం కలుగకుండా, వాహనాల పార్కింగ్ గురించి, ట్రాఫిక్ నియంత్రణ గురించి పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అదేవిధంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 5 సెక్టార్ లను ఏర్పాటు చేసి జిల్లా ఎస్.పి. గారి పర్యవేక్షణలో ముగ్గురు డి.ఎస్.పి.లు, 11 మంది సి.ఐ.లు, 50 మంది ఎస్.ఐ.లు, ఎ.ఎస్.ఐ./ హెడ్ కానిస్టేబుల్ లు 75 మంది, కానిస్టేబుల్ లు 208 మంది, మహిళా కానిస్టేబుల్ సిబ్బంది 61 మంది, హోం గార్డులు 88 మంది, మరియు 8 అక్సెస్ కంట్రోల్ టీంలు, 4 డే బైనాకులర్ టీంలు, స్పెషల్ పార్టీలు, ఎ.ఆర్. సిబ్బంది, కలిపి మొత్తం దాదాపు 500 మంది పటిష్టమైన బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతర బందోబస్త్ ను సి.సి. కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాతో ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగినదని తెలిపారు. అలాగే జాతరకు వచ్చే భక్తులు తమ యొక్క వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ స్థలాల్లోనే తమ వాహనాలను నిలుపుకోవాలని తెలిపినారు. అదేవిధంగా తమ వెంట తీసుకోని వచ్చే వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, అపరిచితులను నమ్మి తమ యొక్క వస్తువులను ఇవ్వరాదని అన్నారు. అదేవిధంగా జాతరలో ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోయినట్లయితే చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలిస్ కంట్రోల్ రూమ్ లో వారి వివరాలు తెలిపాలని, అనుమానితంగా వుండే వస్తువులు, వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే పోలిస్ కంట్రోల్ రూమ్ లో తెలపాలని అన్నారు. జాతరలో భద్రతలో భాగంగా బి.డి.టీం, డాగ్ స్వాడ్ లను ఏర్పాటు చేయడం జరిగినదని, భద్రతలో విషయంలో ఎలాంటి రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, అలాగే భద్రత విషయంలో ప్రజలు పోలిసు వారికి సహకరించాలని కోరారు.

క్రిస్మస్ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, ఈ సందర్భాగా జిల్లా ప్రజలకు ఎస్.పి. గారు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు. అదేవిధంగా సిబ్బంది కూడా సామాజిక దూరంపాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా దరించాలని సూచించారు. ఈ క్రిస్మస్ వేడుకలలో మెదక్.డి.ఎస్.పి. శ్రీ కృష్ణ మూర్తి గారు, తూప్రాన్ డి.ఎస్.పి. కిరణ్ కుమార్ మరియు ఏ.ఆర్. డి.ఎస్.పి. శ్రీనివాస్ గారు, మరియు మెదక్ మరియు తూప్రాన్ సబ్ డివిజన్ల సి.ఐ., ఎస్.లు, మెదక్ జిల్లా ఏ.ఆర్. సిబ్బంది మరియు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుండి వచ్చిన పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బద్రత చర్యలు చేపట్టడం జరిగినది జిల్లా ఎస్.పి. గారు తెలిపారు.