హెల్మెట్ ఉన్న ప్రాణం పోయిందని ప్రత్యక్ష సాక్షులు బాధను వ్యక్తం చేశారు

హైదరాబాద్ : మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్ చౌరస్తాలో ప్రమాదం చోటుచేసుకుంది . ద్విచక్రవాహనం ( టిఎస్ 24 సి3458 ) అదుపు తప్పిపడిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు . బైక్ నుంచి కిండపడగానే హెల్మెట్ పగిలిపోయింది . దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు .

రోడ్డు రక్తపుటేరులుగా మారిపోయింది . పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు . ట్రాఫిక్ జామ్ కు అంతరాయం కలగకుండా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు . హెల్మెట్ ఉన్న ప్రాణం పోయిందని ప్రత్యక్ష సాక్షులు బాధను వ్యక్తం చేశారు . ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది .