{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1629168872983","source":"other","origin":"gallery"}

అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో దేశంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీవనం సాగించిన జనం ఇక రాబోయే గడ్డు రోజులను తలచుకొని బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనలో బతకలేమంటూ త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. ఆఫ్ఘన్ లో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వదేశాలకు పయనమవుతున్నారు. దేశ సరిహద్దులను, భూమార్గాలను తాలిబన్లు దిగ్బంధించడంతో ఆకాశయానమే దిక్కయింది. పది మంది మృతి తాజాగా కాబూల్ గగనతలంలో ఎగురుతున్న ఓ ఎయిర్ క్రాఫ్ట్ చక్రాలను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుతప్పి కిందికి జారిపడి మరణించారు.

ఈ దృశ్యాలను టెహ్రాన్ టైమ్స్ పత్రిక ట్విట్టర్ లో ఉంచింది. గాల్లో విమానం చక్రాల నుంచి జారిపడి ముగ్గురు మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను కలచివేస్తున్నాయి. సోమవారం కాబూల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను అదుపు చేయడానికి అమెరికా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది.