{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580233158223","total_editor_time":39,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580233057315","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రెండు రోజుల క్రితం ఓ అవార్డ్స్ పంక్షన్ లో వేసుకున్న డ్రెస్ పై ఇప్పుడు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్యాషనబుల్ గా ఉండటం తప్పు కాదు..నీ ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు వేసుకోవచ్చు కానీ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేటప్పుడు మాత్రం ఇలాంటి దుస్తులు ధరించి ఉండాల్పింది కాదంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే: ఆదివారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్‌లో సంగీత పరిశ్రమ 62 వ వార్షిక గ్రామీ అవార్డులను జరుపుకుంది. గ్రామీ అవార్డ్స్ వేడుకకు వెళ్లిన ప్రియాంక, ప్రముఖ ఇంటర్నేషనల్ డిజైనర్స్ రాల్ఫ్ అండ్ రూసో డిజైన్ చేసిన పొడవాటి తెలుపు రంగు గౌను వేసుకున్నారు. డ్రెస్ చేప ఆకారంలో బాగానే ఉంది కానీ, ముందు భాగంలో మాత్రం క్లీవేజ్ ఎక్కువైపోయింది. ఎద నుంచి పొట్ట భాగం వరకు కట్ అయివుంది. దాంతో ప్రియాంక డ్రెస్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నయి.

అయితే ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్‌పై వెండెల్ రోడ్రీగ్ అనే భారతీయ ఫ్యాషన్ డిజైనర్ కామెంట్ చేశారు. దాంతో నటి సుచిత్రా కృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రియాంక చోప్రాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నేను ప్రియాంక ఫ్యాన్‌ని కాను. కానీ ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం కిరాక్ ఉంది. పొట్ట చూపించడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. అందుకు ఆమెను చూసి పొగడాలి. మా శరీరాలను చూసి మా క్యారెక్టర్‌ను నిర్ణయించేయకండి. మా టాలెంట్‌ను గుర్తించండి అని క్లాస్ పీకింది.

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు వేసుకునే దుస్తులపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డ్రెస్ సరిగ్గా లేకపోతే ఆమెకు స్టైల్ సెన్స్ లేదని ఓ మాటనేస్తారు. అందుకే ఒక్కోసారి ఇష్టం లేకపోయినా క్లీవేజ్ ఎక్కువగా కనిపించే దుస్తులు వేసుకుంటూ ఉంటారు. అయితే పెళ్లయ్యాక కూడా హీరోయిన్లు ఇలాంటి దుస్తులు వేసుకుంటే సహించలేని భర్తలు ఉంటారు. అయితే ప్రియాంక భర్త నిక్ జొనాస్ అలా కాదు. తన భార్య ఏం చేసినా ఆలోచించే చేస్తుందని అంటుంటాడు. అందుకే ప్రియాంక ఈ డ్రెస్ వేసుకున్నా కూడా నిక్ ఏమీ అనలేదు. పైగా బ్యూటిఫుల్‌గా ఉన్నావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు.