“ప్రియాంక స్కూటీ పార్క్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించాము. టోల్ గేట్ దగ్గర లో ఉన్న ఖాళీ స్థలానికి ప్రహరి లేదు. లారీ డ్రైవర్స్ అక్కడ వాహనాలు పార్క్ చేసి మద్యం సేవిస్తున్నారని మా విచారణలో తేలింది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు పిర్యాదు చేసిన పట్టించుకోకుండా వదిలేశారని స్థానికులు ద్వారా తెలిసింది. తల్లిదండ్రులు పిర్యాదు చేయగానే పోలీసులు స్పందించలేదు మా పరిధి కాదంటూ కాలయాపన చేసినట్లు తల్లిదండ్రులు మా దృష్టి కి తీసుకొచ్చారు.

అక్కడ సీసీ కెమెరాల విజుబులిటీ సరిగా లేవు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ లపై ఎంక్విర్ చేస్తున్నాం. పోలీస్ ల నిర్లక్ష్యం ఉంది, పనికిరాని సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ సరిగ్గా లేదు 100 కి డయల్ చేయాలనే ఆలోచన టెన్షన్ లో ప్రియాంకకు గుర్తుకు రాకపోయి ఉండొచ్చు. ప్రియాంక హత్య పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. ప్రియాంక హత్య కేసును విచారణ చేసి ప్రియాంక కుటుంబ సభ్యులను న్యాయం చేస్తాం”.