అర్ధరాత్రి తండ్రిని తల్లి చంపడం కూతురు చూసింది.. మత్తుమందుఇచ్చి ముఖానికి దిండు అడ్డంపెట్టి చంపేసింది.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది. కర్మకాండ అయిపొయింది. కానీ కూతురుకు తల్లి నీచత్వం పదేపదే కళ్ళముందు కనపడుతుంది . ప్రాణంపోయేప్పుడు తండ్రి గిలగిల కొట్టుకున్న దృశ్యం ఆమెను వెంటాడింది. దీంతో పెదనాన్నకు విషయంచెప్పేసింది. ఖరగ్‌పూర్‌, పట్టణ నింపురా రైల్వే కాలనీకి చెందిన ఎం.ఈశ్వరరావు (44) ఈ నెల 22న మృతి చెందాడు. ఆయన గుండెపోటుతో మృతిచెందాడని, సాధారణ మరణం అని అంతా భావించారు. కార్యక్రమాలు జరిపించి కుటంబ సభ్యులు తీవ్ర దుఖఃంలో ఉండగా ఈశ్వరరావు కుమార్తె తన పెదనాన్న వెంకటరమణ వద్ద తన తండ్రిది సాధారణ మరణం కాదని తల్లే ప్రియుడితో కలసి చంపేసిందని తెలిపింది.

నివ్వెరపోయిన వెంకటరమణ హుటాహుటిన తన సోదరుడి హత్యపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేయగా నేరం రుజువు కావడంతో ఈశ్వరరావు భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎలాగైనా ఈశ్వరరావు అడ్డు తొలగించుకోవాలని ఈ నెల 21 రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఊపిరాడకుండా హత్య చేశారని అది కుమార్తె చూసిందని పోలీసులు వెల్లడించారు. నిందితులను కోర్టుకు తరలించినట్లు పోలీసులు వివరించారు…