వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కానిస్టేబుల్‌ను ఆమె భర్త రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్లపాలెం మండలంలో చోటుచేసుకుంది.

ప్యార్లీ గ్రామానికి చెందిన సునీల్ రాజు అనే వ్యక్తి జవాన్‌గా పని చేస్తున్నాడు. 13 సంవత్సరాల క్రితం అనూష్ అనే అమ్మాయిని సునీల్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె మహిళ కానిస్టేబుల్ గా పని చేస్తూ మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

మళ్లీ తిరిగి వీధులోకి చేరిన అనంతరం ఆమె వేటపాలెం పిఎస్‌లో మహిళ కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఆమె వక్ర బుద్ధి మారకపోవడంతో ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమెను భర్త రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమెపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అతడు కోరాడు.