ప్రియురాలి కూతురును ప్రియుడు చంపిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: అనుషా-కళ్యాణ్ అనే దంపతులకు ఆరేళ్ల కూతురు ఉంది. గత కొన్ని రోజుల నుంచి కరుణాకర్ అనే యువకుడితో అనుషా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెన తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో కరుణాకర్‌ను ఆమె దూరంగా పెట్టింది. ఆమెపై పగ తీర్చుకోవాలని కరుణాకర్ నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అనుషాపై ప్రియుడు దాడి చేశాడు. కత్తితో అనుషా కూతురు ఆద్య గొంతు కోశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆద్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రియుడు కరుణాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.