ప్రియురాలి మరణాన్ని పట్టుకోలేక ఓ ప్రియుడు కాలుతున్న చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే: విల్లుపూర్ జిల్లాలోని పాత సన్నవరంలో శ్రీలత అనే విద్యార్థిని డిగ్రీ చదువుతుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాష్రప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులకు నిర్వహిస్తుండడంతో క్లాసులకు హాజరుకావడానికి తన త్రండ్రి సెల్ ఫోన్ కావాలని అడిగింది. అందుకు తన తండ్రి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త విన్న ప్రియుడు రాము కుంగిపోయాడు.

తన అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్థలానికి చేరుకోని, శ్రీలత చితికి నిప్పంటించిన వేంటనే చితిలో దూకాడు. అక్కడున్న వారు రామును కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతనికి మంటలు వ్యాపించడంతో ఏమి చేయలేకపోయారు. వేంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రేమ జంటఆత్మహత్యలతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.