ఎన్నో రకాల టూరిజాలు చూశాం. కానీ ప్రెగ్నెన్సీ టూరిజం చూసి ఉండరు కదా. అది హిమాలయాల్లో ఉంది. ప్రెగ్నెన్సీ టూరిజం ఏంటి అనుకుంటున్నారా. ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ గర్భం దాల్చి మళ్లీ తమ స్వంత ప్రాంతానికి రావడం హిమాలయాల్లో ప్రెగ్నెన్సీ టూరిజం నడుస్తోంది. హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్ పరిసర ప్రాంతాల్లో ఇది జరుగుతోంది. ఇక్కడి గ్రామాల్లో బ్రోక్పా అనే హిమాలయ తెగ ఉంది. విదేశాల నుంచి ఎందరో మహిళలు ఇక్కడికి వచ్చి ఇక్కడి పురుషులతో సెక్స్ చేసి గర్భం దాలుస్తారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు స్వచ్ఛమైన ఆర్యులని వారు నమ్ముతారు. దాంతో తమకు పుట్టబోయే పిల్లలు కూడా స్వచ్చమైన వారు కావాలని వారి కోరికట. స్వచ్చమైన ఆర్యులకు జన్మనిచ్చే ఉద్దేశ్యంతో మహిళలు విదేశాల నుంచి వస్తుంటారట. 2007 లో సంజీవ్ శివన్ తీసిన ది ఆచ్టంగ్ బేబి, ఇన్ సెర్చ్ ఆఫ్ ఫ్యూరిటి ఇందుకు సాక్ష్యం. జర్మనీకి చెందిన మహిళ ఇక్కడి వ్యక్తితో సెక్స్ చేసి గర్భం దాల్చినట్టు డాక్యుమెంటరీలో చెబుతారు. ఆర్యన్లు ఎత్తుగా, పొడుగ్గా ఉంటారు. ఆర్యన్లనే స్వచ్ఛమైన మనుషులని నమ్మే విదేశీయులు ఈ విధంగా చేస్తారు.

అయితే విదేశీ మహిళలు ముందుగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ప్రెగ్నెన్సీ టూరిజం వారిని కలుస్తారు. అప్పుడు ఆ విదేశీ మహిళలకు వారి దగ్గర ఉన్న పురుషులను చూపిస్తారు. అందులో తనకు నచ్చిన పురుషుడిని ఆ విదేశీ మహిళ ఎంచుకొని కొంత కాలం పాటు అతనితోనే ఉంటోంది. వీరికి సెపరేట్ గా గదులు ఉంటాయి. తనకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఆ మహిళ అతనితో గడుపుతోంది. వీరిద్దరు కలిసే ముందే ఇద్దరి రక్తాన్ని సేకరించి పరీక్షలు చేస్తారు. ఎటువంటి సమస్య లేదని తెలిసాకే వీరి కలయిక జరుగుతోంది. ఇలా ప్రెగ్నెన్సీ రాగానే ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ ఆర్యనుతో గడిపినందుకు మహిళే డబ్బులు చెల్లించి వెళుతుంది. కొన్ని లక్షల రూపాయల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. ఆరు నెలల్లో గర్భం దాల్చకపోతే మహిళ మరో అతనిని ఎంచుకుంటుంది. ఇంత వరకు అలా జరగలేదని తెలుస్తోంది. ఈ విషయం ఆ మహిళల భర్తలకు తెలిసే జరగడం గమనార్హం. అదే విధంగా తమ భర్తలు మరో మహిళతో గడుపుతున్నారన్న విషయం ఆర్యన్ల భార్యలకు కూడా తెలుసు. వారు దీనిని కేవలం తమ భర్తల వృత్తి కోణంలో చూడడం గమనార్హం. ఇక అబ్బాయికి తండ్రి గురించి తెలిసే అవకాశమైతే ఉండదు. మొత్తానికి ప్రెగ్నెన్సీ టూరిజం అక్కడ కాసుల వర్షం కురిపిస్తోంది.