పెళ్లైన 17ఏళ్ల తరువాత ఆ దంపతులిద్దరూ తోబుట్టువులు అని తేలింది. ఇప్పడిదే వైరల్‌గా మారింది. అమెరికాలోని కొలరాడోలో నివసిస్తున్న సెలీనా (సెలీనా క్వినోన్స్) తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి తన బంధువు అని తెలియడంతో నిర్ఘాంతపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. అయితే, వీరిద్దరూ తోబుట్టువులు అయినప్పటికీ వారి పిల్లలలో ఎలాంటి లోపాలు లేవు. ఈ విషయాన్ని సదరు మహిళ టిక్‌టాక్‌లో షేర్ చేసింది. వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం: వారిద్దరూ 2006 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరు వివాహానికి ముందు 4 నెలల పాటు డేటింగ్ కూడా చేశారు. కానీ అప్పటి వరకు ఈ నిజం తెలుసుకోలేకపోయారు. పెళ్లయిన 17ఏళ్ల తర్వాత ఇద్దరూ డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా అసలు నిజం బయటపడింది. ఈ విషయం తెలియగానే వారి కాళ్లకింద భూమి కంపించిపోయింది. కానీ వారిద్దరూ బంధువులు అని తెలిసినా విడిపోబోమని స్పష్టం చేసింది సెలీనా..