acid attack

యాసిడ్ అటాక్ కథ మారింది, అమ్మాయిలు అబ్బాయిలపై యాసిడ్ దాడులకు పాల్పడే కాలమొచ్చింది.
కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువతి యువకుడిపై యాసిడ్‌ దాడి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ నాగేంద్ర అనే వ్యక్తిపై యాసిడ్‌ పోసింది. ఇటీవలే అతడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని పగపెంచుకున్న యువతి గత వారమే యాసిడ్ పోసింది. ఆ ఘటనలో చేయి కాలింది. ఆ గాయం నుంచి కోలుకోక ముందే తాజాగా మరోసారి యాసిడ్‌ దాడికి పాల్పడింది. గమనించిన స్థానికులుñ బాధితుడ్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు నంద్యాల గ్రామీణ సీఐ దివాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.