హైదరాబాద్ లో మొగుడే కాల్ యముడయ్యాడు. భార్య ఫోటోలను నెట్ లో పెట్టి విటులను ఆకర్షించాడు. భార్య భర్తల బంధానికే మచ్చ తెచ్చాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గౌలిగూడకు చెందిన యువతికి అంబర్ పేటకు చెందిన యువకుడికి నాలుగు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో రెండు సంవత్సరాల క్రితం యువతిని కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అక్కడ ఏ పని చేయకుండా ఉండేవాడు. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో అంబర్ పేటకు వచ్చి ఓ అద్దె రూంలో ఉంటున్నారు. ఇక్కడ కూడా యువకుడు ఏ పని చేయకుండా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఏదైనా పని చేయాలని యువతి ఒత్తిడి తెచ్చింది. దీంతో భర్త రూపంలో ఉన్న ఆ రాక్షసునికి భార్యను సెక్స్ రాకెట్ లోకి దింపాలన్న ఆలోచన వచ్చింది.

ఆమె ఫోటోలు, పేరును ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి లైవ్ సెక్స్ చాట్ పేరుతో విటులను ఆకర్షించాడు. ఆ యువతే చాట్ చేసిందనుకొని విటులు రిప్లేలు ఇచ్చేవారు. ఏకంగా వారిని ఇంటికి పిలిచి వారితో మందు పార్టీలు చేశాడు. బలవంతంగా భార్యకు కూడా మందు తాపేవాడు. విటులు ఇంట్లో ఉండగా భార్యను ఇంట్లోనే వదిలి బయటికి వెళ్లిపోయేవాడు. విటుల నుంచి డబ్బు వసూలు చేసి బయటికి వెళ్లేవాడు. విటులు ఇంట్లో ఉన్న ఆమెను వేధిస్తుండగా ఆమె తప్పించుకునేది. ఇలా దాదాపు సంవత్సరం పాటు సాగింది. తాను ప్రేమ వివాహం చేసుకొని తప్పు చేశానని, ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని సంవత్సర కాలంగా ఇబ్బంది ఎదుర్కొన్న ఎవరికి చెప్పలేదని యువతి తెలిపింది. అదే విధంగా మరికొందరు మహిళల ఫోటోలు, భార్య స్నేహితుల ఫోటోలు కూడా అప్ లోడ్ చేశాడు. ప్రతి నెల కొత్త ఐడీలతో, కొత్త ఫోన్ నంబర్లతో పోస్ట్ చేసేవాడు.

ఇటీవల విటులు వచ్చి ఎన్నాళ్లిలా చూపులు, తమకు ఇచ్చిన మాట ప్రకారం కాల్ గర్ల్స్ ను పంపాలని వారు గొడవకు దిగారు. దీంతో 2019 సెప్టెంబర్ లో అతను ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో యువతి అతని ఆచూకీ కోసం గాలిస్తుంది. ఇంతలో విటులు మళ్లీ ఆమె ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించారు. అసలు వారు తమ ఇంటికి ఎందుకు వస్తున్నారో కూడా ఆమెకు తెలియదు. దీంతో ఆమె వారి పై ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ఫోటోలు సోషల్ మీడియాలో కాల్ గర్ల్ గా ఉన్నాయని తెలుసుకొని షాక్ అయ్యింది. యువతి ఫిర్యాదుతో యువకుని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భర్తే కాల్ యమునిగా మారడంతో ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.