ప్లాస్మా దానం చేసిన ప్రాణదాతలుగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ప్లాస్మాదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించబడిన వాల్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, అదిలాబాద్లకు సంబంధించిన కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స నిమిత్తం అత్యవసర సమయాల్లో కావాల్సిన ప్లాస్మాను సమకూర్చేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నూతనంగా కోవిడ్-19 కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకోసం వరంగల్ కమిషనరేట్ అదనపు డి.సి.పి గిరిరాజు, ఆర్.ఐ నగేష్ పర్యవేక్షణలో కరోనా వ్యాధి నుండి కోలుకోని ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా వున్న ప్లాస్మా దాతల పూర్తి సమాచారాన్ని ఈ సెంటర్ ద్వారా సేకరించబడుతుంది.

అదే విధంగా ప్లాస్మా అవసరమయిన వారు ఈ కోవిడ్ కంట్రోల్ వాట్సప్ నంబర్ 9491873930కు పూర్తి సమాచారాన్ని అందజేస్తే వారికి ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతల సెల్‌ నంబర్లతో కూడిన వివరాలను అందజేయబడుతుందని, అదే విధంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు సంబంధించిన పోలీస్ కోవిడ్ కంట్రోల్ రూంలు ఈ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూంకు అనుసంధానమై వుంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో సెంట్రల్, ఈస్ట్ జోన్ల ఇంచార్జ్ డి.సి.పిలు పుష్పా, వెంకటలక్ష్మీ, అదనపు డి.సి.పి గిరిరాజు, వరంగల్, కాజీపేట ఎ.సి.లు ప్రతాప్, రవీందర్ కుమార్, ఆర్.ఐ నగేష్ పాల్గొన్నారు.