అటవీ భూములను స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారి అనితపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఎఫ్‌ఆర్‌ఓ అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆమెతోపాటు మరో 15 మంది అధికారులపై కేసు నమోదుచేయడం గమనార్హం. ఫారెస్ట్ అధికారి అనిత, ఇతర సిబ్బంది తనను కులం పేరుతో దూషించడమే కాక, దాడికి పాల్పడ్డారని సార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశామనీ, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.