జాతీయ పండుగగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం: సత్యవతి

ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో సమ్మక్క-సారక్క జాతర జరుగుతుందని, ఏర్పాట్లకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని అధికారులకు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ సూచించారు. సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించేలా సీఎం కేసీఆర్​ సూచనల మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. గురువారం హైదరాబాద్​లోని సంక్షేమ భవన్​లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

త్వరలోనే అన్ని జిల్లాలు, ఐటీడీఏల్లో పర్యటిస్తానన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక మాంద్యమున్నా బడ్జెట్​లో సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. గిరిజన శాఖకు కేంద్రం నుంచి వచ్చే నిధులు చాలా ఉన్నాయని, వాటిని తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.