హనుమకొండ: బల్దియా పరిధిలోని 22వ డివిజన్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్‌న్ను గురువారం మేయర్ గుండు సుధారాణి అకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్‌ని వాటర్ మానిటరింగ్ సెల్, హెయిర్ బ్లోయర్, ఫిల్టర్ మీడియా, సంప్, పంప్ హౌస్ ను పరిశీలించారు. నగరానికి మంచి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అలాగే ధర్మసాగర్ నుంచి ఫిల్టర్ బెడ్కు వచ్చే రా వాటర్ను, ఫిల్టర్ బెడ్లో నీటిని శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్ చేసిన తరువాత సరఫరా చేసే నీటి నాణ్యతను మేయర్ పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో రంగు మారిన తాగునీరు సరఫరా అవుతుందని పిర్యాదు వచ్చాయన్నారు. ఇందుకు గల కారణాలను తెలుసుకుని వెంటనే పరిష్కరించి శుద్ది నీరు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు బీఎల్ శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, రాజయ్య, డీఈలు రవికిరణ్, ఏఈ కార్తీకెడ్డి తదితరులు పాల్గొన్నారు.