నటి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది

ఓ హీరోయిన్ అర్ధనగ్న ఫొటోలు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షం అయ్యాయి. ఆమె పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసిన కొందరు దుండగులు హీరోయిన్‌కు సంబంధించి అసభ్యకర చిత్రాలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఆ నటి అవాక్కైంది. తమిళ సినిమా జోకర్‌లో నటించిన రమ్య పాండియన్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించిన ఆకతాయిలు హద్దు మీరి నగ్న ఫోటోని షేర్ చేశారు.

బ్యాక్ ఫోజులో సెమీ న్యూడ్ ఫోటో వైరల్ గా మారింది. ఇది రమ్య పాండియన్ అకౌంట్ నుంచి షేర్ చేయడంతో అది కాస్తా జెట్ స్పీడ్ తో వాట్సాపుల్లోనూ వైరల్ అయ్యింది. అయితే అది కాస్తా రమ్యకు తెలిసేసరికి అప్పటికే వైరల్ అయిపోయింది. దీంతో లబోదిబోమన్న సదరు నటి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది. అలాగే తన ఒరిజినల్ ఐడీల్ని కూడా అభిమానులకు తెలియజేసింది. తన ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ వివరాలను తెలియజేసింది. ఎవరైనా తన పేరుతో ఇలాంటి అసభ్యకర పోస్టులు పెడితే తనదృష్టికి తీసుకురావాల్సిందిగా కోరింది.