స్నేహాలు శ్రుతి మించి కాపురాలను కూల్చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వాడితో ఓ ఇల్లాలు వెళ్లిపోయింది. తొమ్మిదేళ్ల కాపురానికి తూచ్ కొట్టేసింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన భర్త లేచిపోయిన జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోత్లాపూర్ కు చెందిన విక్రమ్ గౌడ్‌కు, అదే గ్రామానికి చెందిన అనితకు తొమ్మిదేళ్ల కిందట పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. పెద్దగా చదువుకోని అనితకు ఫేస్‌బుక్‌లో అలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి తారసపడ్డాడు. పొద్దస్తమానం సోది చెప్పుకునేవారు. దీనిపై గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసేవాడు.

అయినా ఆమె పట్టించుకునేది కాదు. ఈ క్రమంలో అనిత గత నెల 26న కనిపించకుండా పోయింది. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందేమోనని గౌడ్ వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో షేక్ ఫేస్ బుక్ ఖతా చెక్ చేయగా.. క్లోజ్ చేసినట్లు తెలిసింది. భార్య అతనితోనే వెళ్లిపోయిందని భావించిన గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు షేక్, అనితల ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.