గోరఖ్‌పూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక మహిళ తన మొబైల్ ఫోనులో భర్తతో మాట్లాడుతూ చూసుకోకుండా రెండు పాములపై కూర్చుంది. దీంతో పాము ఆమెను కాటు వేసింది. చూస్తుండగానే ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గగహా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌ల్యాండ్‌లో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన తన భార్య గీతకు ఫోన్ చేశారు. భర్తతో ఫోనులో మాట్లాడుతూ మంచంపై కూర్చుంది.
అయితే అప్పటికే ఆ మంచంపై రెండు పాములున్నాయి. ఆమె చూసుకోకుండా వాటిపైననే కూర్చుంది. దీంతో ఒక పాము ఆమెను కాటువేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించాగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కాగా గ్రామస్తులు ఆ పాములను మట్టుబెట్టారు.