{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1637588219630","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"version":1,"sources":[]}","premium_sources":[],"fte_sources":[]}

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల్చారం మండలం ఎనగండ్ల గ్రామానికి చెందిన చాకలి సాయిబాబాకు పెద్ద శంకరంపేట్ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మితో 02.04.2008 నాడు గ్రామ కుల పెద్దల సంక్షంలో వివాహం జరిగినదని వారికి ముగ్గురు ఆడపిల్లలు కలరాని, తన భార్య గత కొద్ది రోజుల క్రితం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా 3 తులాల బంగారము 15 తులాల పట్ట గొలుసులు 25,000 నగదు తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయినదని గతములో కూడా ఇలా వెళ్లిపోతే కుల్చారం పోలీసులు తీసుకొచ్చి కౌన్సెల్లింగ్ ఇచ్చి పంపినారని ఇప్పుడు కూడా ఎలాగైనా తన జాడ కనుకొని తనకి మరియు తన పి‌ల్లలకి తగు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని డి‌సి‌ఆర్‌బి సి.ఐ గారికి సూచించారు.

అలాగే నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన నీలం మల్లేశం, సంగు వెంకటేశం గారి ఇంటి నిర్మాణం కాంట్రాక్ట్ కి తీసుకున్నాడని సంగు ఆంజనేయిలు, సంగు చంద్రం గారికి అభ్యంతరం ఉండగా అన్ని రకముల పెర్మిషన్స్ తీసుకొని మరియు సర్వే చేయించి ఇంటి పనులు మొదలు పెట్టినపుడు వారు ఏమి అనలేరని, 14.11.2021 నాడు ఉదయం 11గంటలకు పుట్టింగులు వేసే సమయం లో సంగు ఆంజనేయిలు, సంగు చంద్రం పనివారికి అడ్డుపడి ఇక్కడ పని చేయకూడదని బెదిరించినారు సంగు వెంకటేశం యెస్.ఐ గారికి తెలుపగ వారు వచ్చి పనిని ఆపడానికి వీలులేదని వారి దగ్గర అన్నీ రకముల పెర్మిషన్స్ ఉన్నవని నచ్చచెప్పి వెళ్లిపోయాక.

1. జంగారా మల్లేశం పారా తీసుకొని వచ్చి పిల్లర్ కాలాలను మరియు సిమెంట్ సంచులను ద్వంశం చేసి, తన యొక్క ఫోన్ లాక్కొని తనని మరియు అడ్డు వచ్చిన సంగు తిరుపతిని పారతో రక్తం వచ్చేలా గాయపరిచాడాని కావున, 2. సంగు ఆంజనేయిలు, 3. సంగు చంద్రం, 4. సంగు ఎల్లయ్య, 5. పెద్ద మల్లారెడ్డి రాజు వీరిపై చట్టపరమైన చర్య తీసుకోని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట్ సి.ఐ. గారికి సూచించారు. ఈ రోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాది దారులు రావడం జరిగినది.