మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం బొమ్మారమ్ గ్రామానికి చెందిన పిట్టల చిన్న చెన్నయ్య, పిట్టల కళావతి, పిట్టల రాజమ్మ లకు బొమ్మరం గ్రామంలో సర్వే నెం.863లో 2ఎకరాల 11 గుంటలు, సర్వే నెం.863/ఈ1 లో, 1ఎకరా 14 గుంటలు, సర్వే నెం.863/అలో 2 ఏకారాలు, సర్వే నెం.863/ఇ లో 1ఎకరా, సర్వే నెం.863/ఈ2 లో 30గుంటల భూమి కలదని అట్టి భూమిలో ఒక బోర్ కూడా ఉన్నదని, ఇట్టి భూమిని మా గ్రామానికే చెందిన ఇంద్రసేనారెడ్డి, నందయ్య, లక్ష్మా రెడ్డి లు కలసి మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి మా జాగా మద్యలో కడీలు, జాలీలు వేసి మా భూమిని కబ్జా చేసినారు. ఇట్టి కబ్జా విషయమై వారిని అడుగగా మా పై దౌర్జన్యానికి పాల్పడుతూ మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ప్రస్తుతము 6ఎకరాల లలో మట్టి పోసి పనులు చేసుకుంటున్నారని కావున పైన తెలిపిన వ్యక్తుల పైన చట్టపరమైన చర్య తీసుకోని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి.ఐ గారికి ఫోన్ లో మాట్లాడి పలు సూచనలు చేయటం జరిగింది.

అలాగే రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన రుచిత రామాయంపేట మండలం గోల్పర్తి గ్రామానికి చెందిన ఎర్రంసాగర్ ని ఆరు నెలల క్రితం ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నదని, పెళ్లి అయిన నెల రోజుల వరకు తన భర్త తనని బాగానే చూసున్నారని, ఆ తర్వాత మా అత్త మామ ఆడపడుచు మాటలు వింటూ తనని శారీరకంగా, మానసికంగా వేదిస్తున్నారని ఇట్టి విషయాన్ని రామాయంపేట పోలీసు స్టేషన్లో చెప్పగా పోలీసు వారు తన భర్తని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వగా తనని బాగా చూసుకుంటానని చెప్పినాడని కానీ తన భర్త ఆ రోజు నుండి కనిపియటం లేదని మా ఇంట్లో వారు చెప్పినారు. నేను తనకి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుందని కానీ నా భర్త యొక్క జాడ తన అత్తమామలకు తెలుసని కానీ వారు చెప్పటం లేదని కావున తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట యెస్.ఐ గారికి సూచించారు. ఈరోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాది దారులు రావడం జరిగినది.