జిల్లా SP శ్రీమతి. చందన దీప్తి గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రజావాణిలో బాగంగా ఫిర్యాదుదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదిదారులకు చట్టపరమైన విషయంలో న్యాయం జరగకపోతే ఫిర్యాదిదారులు తిరిగి తమను సంప్రదించవలసిందిగా కోరినారు. ఈ ప్రజవాణి లో భాగంగా మెదక్ పట్టణానికి చెందిన పడిగే స్వరూపకు శెట్టిపల్లి గ్రామానికి చెందిన పడిగే శ్రీనివాస్ తో 2005 వివాహం జరిగినదని, గత కొద్ది కాలం నుండి వీరు విడివిడిగా జీవనం కొనసాగిస్తున్నారని, అయితే స్వరూప తన తల్లికి మెదక్ పట్టణంలో వున్న భూమిని అమ్మి శెట్టిపల్లి గ్రామంలో 5 ఎకరాల భూమిని కొనడం జరిగినది,

ఇట్టి భూమిని శెట్టిపల్లి గ్రామానికి చెందిన మేకల అంజయ్య వద్ద కొనడం జరిగిందని, అట్టి భూమి తాలూకు దస్తావేజులను ఇంట్లోవుంచగా, తను ఇంట్లో లేని సమయంలో తన భర్త, బావ, అత్త వాళ్ళు ఇట్టి దస్తావేజులని, ఇంటి సామాగ్రిని దొంగలించుకొని పోయారని, ఇట్టి భూమిలో ప్రస్తుతం తన గ్రామానికి చెందిన వేరే వ్యక్తులు కౌలు చేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని అడుగగా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని జిల్లా ఎస్.పి. గారికి ఫిర్యాదు చేయగా ఎస్.పి. గారు స్పందిస్తూ బాధితురాలికి చట్టప్రకారం తగిన న్యాయం చేయాలని, చట్ట రీత్యా చర్యలు చేపట్టాలని తూప్రాన్ సి.ఐ. గారికి సూచించడం జరిగినది.

అలాగే చిన్న శంకరంపేట గ్రామానికి చెందిన మామిడి భూదేవికి మెదక్ మండలం కోంటూర్ గ్రామానికి చెందిన మామిడి ప్రభాకర్ తో 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది, 4 సంవత్సరాలు వీరు బాగానే వున్నారని, గత కొద్ది కాలంగా తన భర్త తనని శారీరకంగా మానసికంగా వేదిస్తున్నాడని, పలుమార్లు పంచాయితీలు కూడా నిర్వహించడం జరిగినది, తేదీ 28.04.2019 నాడు తనకు తెలియకుండా తన భర్త కొంగోడు గ్రామానికి చెందిన జ్యోతిని 2వ వివాహం చేసుకున్నాడని ఇట్టి విషయంలో తన అత్త కూడా తన భర్త కు సహకరించిందని , ఇట్టి తనకు తగిన న్యాయం చేయగలరని జిల్లా ఎస్.పి. గారికి ఫిర్యాదు చేయగా ఎస్.పి. గారు స్పందిస్తూ బాధితురాలికి చట్టప్రకారం తగిన న్యాయం చేయాలని, చట్ట రీత్యా చర్యలు చేపట్టాలని ఎస్.ఐ శంకరంపేట ఆర్ గారికి సూచించడం జరిగినది. ఈ రోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాదు దారులు రావడం జరిగినది.