మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన సాతెల్లి శివయ్య కు సర్వే నెం.79/అ రక్భ లో 0-38 గుంటలు 79/అ రక్బ లో 0-37 గుంటలు మొత్తం 1-35 గుంటల భూమి కాలదని మా ఊరికే చెందిన టి.సిద్దయ నా పొలంలోకి వచ్చే ప్రయత్నం చేయాగా ఇట్టి విషయంలో తాను కోర్టును ఆశ్రయించానని కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని అయినప్పటికి పైన తెలిపిన వ్యక్తి అతని కుమారులు మరి కొంతమంది వచ్చి తన పై దాడి చేస్తున్నారని కావున పైన తెలిపిన వ్యక్తుల పైన చట్టపరమైన చర్య తీసుకోని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ డి.యెస్.పి గారికి సూచించారు.

అలాగే హవేలిఘనాపూర్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన తంగరి దీప తన వివాహము తేదీ:19.05.2021 లో బూర్గుపల్లి గ్రామానికి చెందిన సాంసన్ (రత్నయ్య) తో జరిగిందని వివాహ సమయంలో తన తల్లితండ్రులు కట్నం కింద రూ.15000/-నగధు, 5 ½ తులాల బంగారం, ఒక పల్సర్ మోటారు సైకిల్ ఇచ్చినారని, ప్రస్తుతం నా భర్త, అత్తమామలు, ఆడపడచు సుకన్య, సౌజన్య, మహేశ్ లు గత రెండు నెలల నుండి అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెడుతున్నారని కావున పైన తెలిపిన వ్యక్తుల పైన చట్టపరమైన చర్య తీసుకోని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని హవేలిఘనాపూర్ యెస్.ఐ. గారికి సూచించారు.

అలాగే చిలిప్చేడ్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన మాణిక్యరెడ్డి కి వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామం సర్వేనెం.159 లో నాలుగు ఏకారాల ఐదు గుంటల భూమి ఉన్నదని, దానిలో వరి సాగు చేసుకుంటున్నానని, తేదీ:04.11.2021 నాటి రాత్రి 1.గొల్ల మల్లేశం, 2.నర్సింహారెడ్డి, 3.సత్తి రెడ్డి, 4.సంజీవరెడ్డి అనే వ్యక్తులు తన వరి పంటను దొంగతంగా కోసివేసి తీసుకెళ్లినారని కావున నా పంటను దొంగతంగా కోసివేసి తీసుకెళ్లిన పైన తెలిపిన వ్యక్తుల పైన చట్టపరమైన చర్య తీసుకోని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని వెల్దుర్తి యెస్.ఐ. గారికి సూచించారు. ఈ రోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాది దారులు రావడం జరిగినది.